దుర్గాంబికా దేవి కోసం నిర్మించిన కాళహస్తి లోని దుర్గాంబికా దేవాలయం చాలా పురాతనమైనది. చాలా ఇతర హిందూ దేవాలయాల్లాగే దీన్ని కూడా ఒక చిన్న కొండ మీద నిర్మించారు. కాళహస్తీశ్వరుడి దేవాలయానికి ఉత్తరం వైపు సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తున దీన్ని నిర్మించారు.
దీని రమణీయ దృశ్యాల వల్ల స్థానికులే కాక పర్యాటకులు కూడా ఈ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తారు. కొండ దిగువ నుంచి బాగా వెడల్పాటి మెట్లు నిర్మించారు. దీనివల్ల ఈ కొండ ఎక్కడం చాలా తేలికవుతుంది. దేవతలను హిందువులు జీవన ప్రదాతలుగా భావించడం వల్ల దుర్గాంబికా దేవి చాలా ధార్మిక ప్రాధాన్యం కలిగి వుంది. జన్మనివ్వడమే కాక వారు భూమి మీద జీవితాన్ని పోషిస్తారని కూడా నమ్ముతారు. అందువల్ల వందలాది మంది భక్తులు ఈ దేవత దీవెనల కోసం ఇక్కడికి వస్తారు.