శ్రీకాళహస్తి లో కొనుగోళ్ళు చేయడం ఒక ఆహ్లాదకరమైన అనుభవం కనుక అందరికీ సిఫార్సు చేయబడుతోంది. ఇక్కడి కలంకారీ చిత్రకళకు శ్రీకాళహస్తి ప్రసిద్ది. కేవలం సహజ, హానికారకాలు లేని రంగులతో చిత్రాలు వేయడం ఈ కళలో ప్రత్యేకత. ఈ రంగులను మొక్కలు, కూరగాయల నుంచి తయారు చేస్తారు కనుక వాతావరణానికి అనుకూలంగా వుంటాయి.
ఇందులో తయారైన రంగులు చాలా ప్రకాశవంతంగా, ఆహ్లాదకరంగా వుంటాయి. శ్రీరాం నగర్ కాలనీ, బి ఫై అగ్రహారం లలో ఈ కలంకారీ చిత్రాలు దొరుకుతాయి. మీకు నచ్చే, మీరు మరింత కావాలని కోరుకునే ఇతర కళాకృతులు కూడా ఇక్కడ దొరుకుతాయి. శ్రీకాళహస్తి లో ఇష్ట దైవం శివుడు కనుక శివుడికి సంబంధించిన అనేక వ్యాపార వస్తువులు మీకు ఇక్కడ దొరుకుతాయి. ఈ పట్టణానికి వున్న ధార్మిక ప్రాముఖ్యం వల్ల ఇక్కడి నుంచి పర్యాటకులు, భక్తులు పూజకు పనికి వచ్చే వస్తువుల్లా౦టివే కొంటారు.