Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాళహస్తి » వాతావరణం

కాళహస్తి వాతావరణం

ఉత్తమ సమయం :అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఎండలు మరీ తీవ్రంగా వుండవు కనుక ఆ సమయంలో శ్రీకాళహస్తి సందర్శనకు అనువుగా వుంటుంది. తేమ స్థాయి కూడా తగ్గిపోవడం వల్ల బయటకు వెళ్లి పర్యాటక స్థాలాలు చూడవచ్చు. ఈ నెలల లోనే ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి కనుక పర్యాటకులు కూడా ఆ సమయంలోనే ఇక్కడికి వస్తారు. 

వేసవి

వేసవి :ఆంధ్రప్రదేశ్ లోని ఇతర పట్టణాల్లో లాగే శ్రీకాళహస్తి లో కూడా వేసవి చాలా తేమగా వుంది భరించలేని విధంగా వుంటుంది. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్షియస్ కు చేరుతుంది కనుక ఇళ్ళలోంచి బయటకు రావడం గగనంగా వుంటుంది. ఫిబ్రవరి చివర మొదలయ్యే వేసవి మే చివరి దాకా కొనసాగుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం :జూన్ మధ్యలో మొదలయ్యే వర్షాకాలం ఆగస్ట్ చివరిదాకా వుంటుంది. ఈ పట్టణంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురుస్తుంది. గాలుల పై ఆధారపడి ఈ వర్షాలు తుఫానుగా కూడా మారవచ్చు. ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది కానీ దీంతో మంచు స్థాయి కూడా పెరుగుతుంది.

చలికాలం

శీతాకాలం :శ్రీకాళహస్తి లో శీతాకాలం ఉత్తర భారతానికి విరుద్ధంగా వుంటుంది. ఇక్కడ శీతాకాలం డిసెంబర్ లో మొదలయి ఫిబ్రవరి మధ్య దాకా వుంటుంది. ఈ మూడు నేలల పాటు  వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుండి, ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్షియస్ వద్ద స్థిరంగా ఉండిపోతుంది. రాత్రిళ్ళు చల్లబడతాయి గానీ, మంచు కురవదు.