పుటుడి జలపాతం కంధమాల్ పరిపాలక ప్రధాన కేంద్రం ఫుల్బని నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పచ్చటి అడవులు, బంజరు శిలా పర్వతాల మధ్య ఉన్న ఈ జలపాతం 100 మీటర్ల ఎత్తు నుండి బడ సలుంకి నది లోనికి ప్రవహిస్తుంది. నగరంలోని రణ, గొణ ధ్వనుల నుండి దూరంగా అడవుల మధ్యలో ఉండే ఈ నిర్మలమైన, ప్రశాంత ప్రదేశం లోని నిశ్శబ్దం కేవలం జలపాతం లోని నీటి గర్జనకు మాత్రమే విచ్చిన్నమౌతుంది.
పుటుడి జలపాతం దృశ్యాలను అందించే ప్రాంతంగా కెమేరాకు ఎంతో మేతను అందిస్తుంది. ఈ ప్రాంత అందాల వలన అనేక ప్రాంతీయ చలనచిత్రాలను ఇక్కడ నిర్మించారు. సందర్శకులు స్నేహితులతో, కుటుంబంతో విహారయాత్రకు తరచూ ఈ ప్రాంతానికి వస్తారు. పుటుడికి చక్కటి రోడ్డు సౌకర్యం ఉండటం, ఈ ప్రాంతానికి ప్రయాణించడం ఎంతో సులువుగా మారింది. పుటుడి జలపాతం సందర్శనకు వాతావరణం, నీరు చల్లగా ఉండే శీతాకాలం ఉత్తమ౦గా ఉంటుంది.