Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కంధమాల్ » వాతావరణం

కంధమాల్ వాతావరణం

కంధమాల్ లో వాతావరణం కంధమాల్ పర్యటనకు సెప్టెంబర్, మార్చి మధ్య కాలం ఉత్తమమైనది. ఈ సమయంలో పర్యాటకులు మిగిలిన రోజులలోని వెచ్చటి వేసవి నుండి తప్పించుకోవచ్చు. మంచు నిండిన చల్లటి కంధమాల్ ను చూసి ఆనందించ వచ్చు. ఈ వేసవి విడిది ని శీతాకాలంలో సందర్శించడానికి వెచ్చని దుస్తులను ఎక్కువగా తీసుకో వెళ్ళండి.

వేసవి

వేసవికాలం వెచ్చగా, పొడిగా ఉండే వేసవికాలంతో కంధమాల్ ఉప ఉష్ణమండల వాతావరణాన్ని కల్గి ఉంటుంది. వేసవి కురచగా ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ నెల మొదటి వారం వరకు ఉంటుంది. అయితే, దరింగబడి, బెల్ఘర్ వంటి ప్రదేశాలు ఎత్తైన ప్రాంతాలైనందున ఏడాది పొడవునా చల్లగానే ఉండి, ఉత్తమ వేసవి విడిదిగా పనిచేస్తాయి.

వర్షాకాలం

వర్షాకాలం జూన్, జూలై, ఆగష్టు, మధ్య సెప్టెంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది. వర్షాలు ఒక మోస్తరు నుండి భారీగా కురుస్తాయి. వర్షాలు ఎక్కువగా 15 జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కురుస్తాయి. ఈ ప్రాంతంలోని అందం నిండిన జలపాతాల వలన ఇనుమడిస్తుంది.

చలికాలం

శీతాకాలం అక్టోబర్, మార్చి మధ్య ఉండే శీతాకాలం అతి పొడవుగా ఉంటుంది. దరింగ బడి వంటి ప్రదేశాలలో ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ స్థాయికి పడిపోయి, అప్పుడప్పుడు మంచు కురుస్తుంది. మిగిలిన ప్రాంతాలలో ఉష్ణోగ్రత 3,4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.