Search
  • Follow NativePlanet
Share

కంకేర్ – సంస్కృతి, సంప్రదాయంలో ప్రజాదరణ!

15

కంకేర్ జిల్లా, ఛత్తీస్గడ్ లోని దక్షిణ ప్రాంతంలో రాయ్ పూర్, జగ్దల్పూర్ అనే రెండు బాగా అభివృద్ది చెందినా నగరాల మధ్య ఉంది. పూర్వం కంకేర్ బస్తర్ జిల్లలో ఒక భాగం, 1998 లో కంకేర్ ఒక స్వతంత్ర జిల్లాగా గుర్తింపు పొందింది. ఈ జిల్లా చిన్న పర్వత ప్రాంతం మధ్యలో ఉంది, ఈ జిల్లా గుండా మహానది, దూద్, హత్కుల్, సిందూర్, తురుర్ అనే ఐదు నదులు ప్రవహిస్తాయి.

కంకేర్ జిల్లాలోని అటవీ ప్రాంతం ఎక్కువభాగం పొడి ఆకురాల్చు విధానం లో ఉంటుంది. కంకేర్ జిల్లలో సాల్, టేకు, మిశ్రమ అడవులను కనుగొనవచ్చు. సాల్ అడవులు జిల్లాలోని తూర్పు భాగంలో కనిపిస్తాయి, టేకు అడవులు భానుప్రతప్పూర్ ప్రాంతంలో కనిపిస్తాయి, ఎక్కువ భాగం మిశ్రమ అడవులు ఉంటాయి. ఈ మిశ్రమ అడవులలో అనేకరకాల ఔషధ గుణాల మొక్కలు, ఆర్ధికంగా ప్రాధాన్యత పొందిన ఇతర మొక్కలు ఉంటాయి.

కంకేర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ఛత్తీస్గడ్ రాష్ట్రము వేగంగా ప్రాచుర్యం పొందిన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఛత్తీస్గడ్ లోని కంకేర్ జిల్లా 12 వ శతాబ్దం లోని లేట్ మహారాజాధిరాజ్ ఉదయ్ ప్రతాప్ దేవ్ కు చెందిన చాలా పురాతన పేరుగాంచిన కంకేర్ రాజభవనం పర్యాటక ఆకర్షణలలో కొన్ని. గడియ పర్వతం, మలన్ఝకుడుం జలపాతం, మా శివాని ఆలయం, చర్రే-మర్రే జలపాతాలు ఆశక్తికర ఇతర ప్రదేశాలు.

కంకేర్ – కళలు, సంస్కృతి

కంకేర్ లోని గిరిజన సంఘం వారు అనేకరకాల నమూనాలు, రూపాలతో అద్భుతమైన చేతిపనుల తయారీ నైపుణ్యంలో ప్రసిద్ది చెందారు. ఈ చేతి పనులలో చెక్క-బొమ్మలు, బెల్-లోహపు వస్తువులు, టెర్రకోట వస్తువులు, వెదురు వస్తువులు మొదలైనవి ఉన్నాయి. కంకేర్, దట్టమైన అడవులతో చుట్టబడి ఉండడం వల్ల, ఎంతో ఆకర్షణీయమైన చెక్క-బొమ్మల హస్తకళలకు, ఎంతో నైపుణ్యం గల చేతులతో తయారుచేయబడిన వివిధ రకాల గ్రుహోపకరణాలకు ఈ జిల్లా మంచి లక్షణాలు కలిగిన చెక్కను కలిగి ఉంది. ఈ వస్తువులు స్థానికులను అదేవిధంగా బైటవారిని కూడా ఆకర్షిస్తాయి.

కంకేర్ ప్రజలు చెక్క, వెదురు హస్తకళలలో కూడా నైపుణ్యం కలవారు. ఇది ఈ తెగల అందమైన, ప్రత్యెక కళల చెక్క బొమ్మలకు అత్యంత ప్రసిద్ది చెందిన వాటిలో ఒకటి. ఈ చెక్క బొమ్మలు నాణ్యమైన టేకు చెక్కతో, తెల్ల చెక్కతో తయారుచేస్తారు. నమూనాలు, విగ్రహాలు, గోడ పానేళ్ళు, గృహోపకరణాలు మొదలైనవి చెక్కతో చేసిన చేతి వస్తువులు. ఈ హస్తకళాకృతులు సాధారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయబడతాయి, ఇవి విదేశాలలో కూడా వీటికి మంచి గిరాకీ ఉంది. ఈ తెగలకు వెదురు చేతిపనులలో కూడా మంచి నైపుణ్యం ఉంది. వెదురుతో తయారుచేసిన గోడకు వ్రేలాడతీసేవి, టేబుల్ లాంప్, టేబుల్ మాప్ వంటివి ఈ తెగల ఉత్తమ రూపకల్పనలలో కొన్ని.

కనేర్ సందర్శనకు ఉత్తమ సమయం

ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుకూలంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే అక్టోబర్ నుండి మార్చ్ వరకు కంకేర్ జిల్లాని సందర్శించడం ఉత్తమం.

కంకేర్ చేరుకోవడం ఎలా

కంకేర్ కి జిల్లా నుండి 167 కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న రాయ్ పూర్ రైల్వే స్టేషన్, రాయ్ పూర్ విమానాశ్రయంతో సులువుగా చేరుకోవచ్చు. విమానాలు, రైళ్ళ ప్రత్యామ్నాయాలతో ఈ జిల్లలో ప్రయాణం చేయవచ్చు, కంకేర్ కి కలిపే సమీపంలోని ప్రధాన పట్టణాలను 43 వ జాతీయ రహదారి గుండా రహదారి ప్రయాణాన్ని ఉపయోగించుకోవచ్చు.

 

కంకేర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కంకేర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కంకేర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కంకేర్

  • రోడ్డు ప్రయాణం
    కంకర్ కు రేయ్ పూర్ నుండి తరచుగా బస్సు లు కలవు. టాక్సీ లు కూడా లభ్యంగా వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    కంకర్ కు సమీప రైలు స్టేషన్ రేయ్ పూర్ లో కలదు. ఇక్కడ నుండి దేశంలోని ప్రధాన ప్రాంతాలకు రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సమీప ఎయిర్ పోర్ట్ రేయ్ పూర్ లో 167 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి దేశం లోని ప్రధాన ప్రాంతాలకు విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri