కన్నూర్ పట్టణం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేరుకున్ను అనే చిన్న గ్రామం ఆధ్యాత్మికత గ్రామంగా ప్రసిద్ది చెందింది. మలయాళంలో చేరుకున్ను అంటే చిన్న పర్వతమని అర్ధం. ఈ చుట్టు పక్కల ఉన్న చిన్న పర్వతాల వల్ల ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని భావిస్తారు.
చేరుకున్ను కి అందానిచ్చే ఎన్నో చిన్న చిన్న ద్వీపాలు (స్థానిక భాషలో తురుత్) ఇక్కడ ఉన్నాయి. తావం చర్చ్ ( ప్రాచీన రోమన్ కాతోలిక్ చర్చ్) , ఒలియంకర జుమ మస్జిద్ (పేరొందిన సుఫీ సమాధి ఉన్న ప్రదేశం) మరియు సెయింట్ మార్టిన్ డి పోరిస్ హాస్పిటల్ (స్థానికంగా మిషన్ హాస్పిటల్ గా ప్రసిద్ది)
అన్నపూర్ణేశ్వరి టెంపుల్,ప్రసిద్ధంగా చేరుకున్నిలమ్మ ఆలయం, చేరుకున్ను లో భక్తులని మరియు పర్యాటకులని అమితంగా ఆకర్షించే ప్రదేశం. భారత దేశంలో ఉన్న కొన్ని ఆలయాలలో శ్రీ అన్నపూర్ణేశ్వరి ని ఆరాధించే ఆలయం ఇది. పార్వతీ దేవి మరో రూపం అయిన అన్నపుర్నేశ్వరి అమ్మవారిని ఇక్కడ ఆరాధించి అన్నదానం అనే ఆచారాన్ని ఇక్కడ పాటిస్తారు.