ధర్మదమ్ ప్రాంతం నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న చిన్న ద్వీపమే ఈ ధర్మదమ్ ఐలాండ్. ఏపైన కొబ్బరి చెట్లతో, పచ్చని పొదలతో అయిదు ఎకరాల మేరకు ఈ ద్వీపం విస్తరించబడినది. గ్రీన్ ఐలాండ్ గా ఈ ద్వీపం ప్రాచుర్యం పొందింది. చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి సౌందర్యం ఈ పేరుని నిజం చేస్తుంది.
తలసేర్రి నుండి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న ధర్మదమ్ టౌన్షిప్ లో ఈ ద్వీపం ఉంది. ఈ ద్వీపం ముజ్హుప్పిలన్గడ్ బీచ్ నుండి కనబడుతూ వీక్షకులను మురిపిస్తుంది. పర్యాటకులు అలల తాకిడి తక్కువగా ఉన్న సమయంలో ఈ బీచ్ నుండి ద్వీపానికి నడిచివెళ్ళవచ్చు. అయితే, నిపుణుల పర్యవేక్షణ లో నే నడిచి వెళ్ళడం సురక్షితమని పర్యాటకులు మరచిపోవద్దు.
ధర్మదమ్ ద్వీపం ప్రైవేటు యాజమాన్యం అధీనం లో ఉంది కాబట్టి ఈ ద్వీపాన్ని సందర్శించేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి.