ప్యాథల్ మల , వైతల్ మల అని కూడా పేరు ఉన్నది. కన్నూర్ పట్టణానికి 60 కిలో మీటర్ల దూరం లో , కేరళ- కర్ణాటక సరిహద్దుల లో ఉన్నది ఈ ప్రదేశం. 4500 అడుగుల ఎత్తు ఉన్న ఈ అద్భుత సుందర ప్రదేశం పచ్చని కొండలతో ఉండి పర్యాటకులు ప్రక్రుతి అందాలను తరచి చూసి ఆనందించటానికి ఆహ్వానిస్తుంది.
వన్య మృగ మరియు వృక్ష సంపద కల ఈ సుందర ప్రదేశం ప్రక్రుతి ప్రేమికులని , వన్యమృగ అభిమానులని విశేషంగా సంతోష పరుస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్ కి అనువుగా ఉన్న ప్రదేశాలతో , కొండ పైకి చేరటానికి పర్యాటకులు 6 కిలోమీటర్ల కాలి దారిన నడవవలసి వొస్తుంది. ఈ పర్యాటక ప్రాంత గొప్పతనాన్ని గుర్తించిన అధికారులు ఈ ప్రదేశాన్ని హిల్ రిసార్ట్ గా తీర్చి దిద్ద టానికి నడుం బిగించారు.
ఈ పచ్చని సుందర ప్రదేశం తన అందాలతో ఫటోగ్రాపర్ లకు ఏంతో ఆనందాన్ని కలిగిస్తుంది, అంటే కాక పర్యాటకులకు ఈ కొండపైన్ నుంచి కనిపించే అందాలు అధ్బుతమైన అనుబుతిని మిగులుస్తాయి.ఇక్కడి పచ్చకబయళ్ళ పై వీచే చల్లటి గాలి , పర్వత ప్రాంతం పర్యాటకులను ఎండా కాలం లో పర్యటనకు అనువైన వాతావరణాన్ని కలిగించి పర్యాటకులని సేద తీరుస్తాయి.ఈ కొండ పైన వైతల్కొన్ అనే ఒక తెగ నాయకుని పురాతన పాలస్ అవశేషాలు చూడవచ్చు.