Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » వాతావరణం

కన్నూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వర్షాకాలం మరియు మండుటెండలలో తప్ప సంవత్సరం మొత్తంలో కన్నూర్ ని ఏ సమయం లో నైనా సందర్శించవచ్చు. వర్షాకాలం ముగిసిన సెప్టెంబర్ నెల నుండీ ఫిబ్రవరి ఆఖరి వారం వరకు అంటే ఎండాకాలం మొదలు అవ్వక ముందు వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ సమయంలో ఎన్నో పండుగలు జరుగుతాయి. అలాగే, బీచ్ ల ను సందర్శించేందుకు కూడా ఈ సమయం అనువైనది.  

వేసవి

ఎండాకాలంఅధికమైన వేడి మరియు తేమలతో ఎండాకాలం లో ఇక్కడ వాతావరణం ఉంటుంది. మార్చ్ నెలలో ఎండాకాలం ప్రారంభమై మూడు నెలల పాటు సాగుతుంది. 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఇక్కడ ఉష్ణోగ్రత చేరవచ్చు. ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంకేరళ లో ఉన్న వేరే కోస్తా ప్రాంతాల లాగానే, కన్నూర్ లో కూడా వర్షాకాలం లో భారీ వర్షపాతం నమోదవుతుంది. నైరుతి రుతుపవనాల వల్ల జూన్ నుండి సెప్టెంబర్ వరకు కన్నూర్ లో వర్షపాతం నమోదవుతుంది. ఈశాన్య రుతుపవనాల వల్ల అక్టోబర్ నుండి నవంబర్ వరకు వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం కలదు. భారీ వర్షపాతం నమోదయ్యే జూన్ మరియు జూలై నెలలు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైనవి కావు.

చలికాలం

శీతాకాలం కన్నూర్ లో ని పర్యటనకు మరియు అవుట్ డోర్ ఆక్టివిటీస్ కి అనువైన సమయం శీతాకాలం. డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకు ఉండే శీతాకాలం లో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలం లో ఇక్కడ ఉష్ణోగ్రత 16 డిగ్రీ ల సెల్సియస్ వరకు పడిపోతుంది. కాబట్టి, ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయం శీతాకాలం.