కాన్పూర్ సంగ్రహాలయ లేదా కాన్పూర్ మ్యూజియం అనేది సిటీలో అధికారిక మ్యూజియం. ఈ మ్యూజియంలో అనేక కళాకృతులు, స్మారకాలు, సిటీకి సంబంధించిన వివిధ వ్యక్తుల చరిత్రలు, బ్రిటిష్ వారితో స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వారి చరిత్రలు, మున్నగునవి ప్రదర్శించ బడతాయి. వీటిలో బ్రిటిష్ కాలం నాటి ఒక తుపాకి ప్రసిద్ధమైనది. కాన్పూర్ చరిత్ర , సంస్కృతు లకు సంబంధించి ఈ మ్యూజియంలో మీకు సరైన సమాచారం లభిస్తుంది. 1999లో స్థాపించబడిన ఈ మ్యూజియం ప్రస్తుతం ఫూల్ సింగ్ బాగ్ లో కాన్పూర్ లక్నో రోడ్ లోని మాల్ రోడ్ లో కలదు.