శివగంగై జిల్లాలో ఉన్న చిన్న గ్రామం కనడుకతాన్. ఇది కరైకుడి కి అత్యంత సమీపం లో ఉంది. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఇక్కడ ఉన్న ఇల్లు అలాగే ఇక్కడి వంటకాలలో కనిపిస్తుంది. అచ్చమైన చెట్టినాడ్ శైలిలో ఇక్కడ ఇల్లు నిర్మించబడ్డాయి. ఇళ్ళ ల్లోని ప్రధాన ద్వారాలు అలాగే ప్రవేశ మార్గాలు హిందూ ఆలయాల గేటు వే ల యొక్క అద్భుతమైన నిర్మాణాలను తలపిస్తాయి.
మూలికలు, మసాలా దినుసుల మేళవింపుతో అచ్చమైన చెట్టినాడ్ శైలిలో స్థానిక వంటకాలు తయారుచేయబడతాయి. కరైకుడి నుండి ఎంతో మంది పర్యాటకులు ఈ వంటకాల రుచి చూసేందుకు తరలి వస్తారు.
కనడుకతాన్ వీధులలో సాధారణంగా కనబడే దృశ్యం ఒక తీగతో కప్పబడిన గొయ్యి. వాననీటి నిల్వ కోసం ఈ విధంగా తయారుచేయబడతాయి. ఈ నీళ్ళని ఉపయోగించటం కోసం ఈ టౌన్ ప్రత్యేకమైన నీటి శుద్ధీకరణ చిట్కాల ని ఉపయోగిస్తుంది. దేశం లో ని అన్ని గ్రామాల ప్రజలు నీటి నిల్వల కోసం కనడుకతాన్ ప్రజల నుండి ఎంతో కొంత నేర్చుకోవచ్చు.