సాని గ్రామం లో కల సాని అరామాన్ని తుర్తోట్ గ్యాట్ అని అంటారు. ప్రపంచం లోని బౌద్ధులకు గల ప్రసిద్ధి క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆరామం, ప్రపంచంలోని 8 ప్రసిద్ధి ఆరామాలలో ఒకటి. దీనిని ఖ్యాతి గాంచిన నరోపా, పద్మసంభవ, మార్పా వంటి బౌద్ద గురువులు సందర్శించారు . దీనిని కుషాన్ రాజు కనిష్కుడు 1 వ శతాబ్దం లో నిర్మించాడు. ఈ ఆరామం ద్రుక్పా కర్గ్యూ స్కూల్ ఆఫ్ టిబెటన్ బుద్ధిజం కు చెందినది. లడఖ్ మరియు జన్స్కార్ ప్రాంతాలలో ఇది పురాతన ఆరామం.
బౌద్దుల 108 ప్రసిద్ధ స్తూపాలలో ఒకటైన 20 అడుగుల ఎత్తుగల ఒక స్తూపం ఇక్కడ కలదు. ఆరామం ప్రాంగణం నలుచదరంగా వుంటుంది. హాలులో చంబ, చేనేరెన్, పద్మసంభవ మత గురువుల చిత్రాలు వుంటాయి. బౌద్ధ మత గ్రంధాలు కొన్ని కలవు. ప్రతి సంవత్సరం ఒక మాస్క్ డాన్స్, సాని నారో నాస్జాల్, గ్రేట్ ప్రేయర్ వంటివి జరుగుతాయి.