Search
  • Follow NativePlanet
Share

కరూర్ – కొనుగోలుదారులకు ఆనందాన్నిచ్చేది!

16

కరూర్, అమరావతి ఒడ్డున ఉన్న ఒక పట్టణం, ఇది తమిళనాడు లోని కరూర్ జిల్లా కు కేంద్రం. దీనికి ఆగ్నేయంలో 60 కిలోమీటర్ల దూరంలో ఈరోడ్; దక్షిణాన 70 కిలోమీటర్ల దూరంలో త్రిచి; దక్షిణం వైపు 100 కిలోమీటర్ల దూరలో సాలెం; ఉత్తరాన 141 కిలోమీటర్ల దూరంలో మదురై; తూర్పున 131 కిలోమీటర్ల దూరంలో కోయంబత్తూర్ ఉన్నాయి.

కరూర్ జిల్లా తిరుచిరాపల్లి బైటి శాఖలతో 1995 లో నిర్మించబడింది, ఈ పట్టణం దాని ప్రధానకే౦ద్రం అయింది. ఈ జిల్లా గుండా కావేరి, అమరావతి, నాల్కసి, కుదగానర్, నోయ్యాల్ మొదలైన అనేక నదులు ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా, ఇక్కడ అనేక కుటీర పరిశ్రమలు ఉండడం వల్ల కరూర్ లో షాపింగ్ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.

కరూర్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు

కరూర్ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ది. ఈ పట్టణం ఏడు పవిత్రమైన శివాలయాలలో ఒకటి. ఐదు అడుగుల ఎత్తుగల లింగం ఉన్న పసుపతిశ్వరలింగం ఆలయం ఈ పట్టణం లోని అత్యంత ప్రసిద్ధ ఆలయం.

పుగాలిమలై శ్రీ ఆరుపడై మురుగన్ ఆలయం, కళ్యాణ పసుపతీశ్వర ఆలయం, శ్రీ కరువుర్ మరియమ్మన్ ఆలయం, నేరుర్ శ్రీ సదాశివ భ్రమేంద్ర ఆలయం, శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం, శ్రీ సోలియమ్మన్ ఆలయం, శ్రీ మహా కాలియమ్మన్ ఆలయం, శ్రీ వెంగలమ్మన్ ఆలయం, కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం, శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మన్ ఆలయం, సదాసివ ఆలయం, అగ్నీశ్వర ఆలయం ఇతర ప్రసిద్ధ ఆలయాలు.

మయనుర్, నోయ్యాల్, నేరుర్, చేట్టిపలయం, తిరుముక్కుదాల్, కడవుర్ కరూర్ కి సమీపంలోని ఇతర ప్రదేశాలు. కరూర్ ప్రభుత్వ మ్యూజియం మరో పర్యాటక ఆకర్షణ. పొంగల్, తమిళ కొత్త సంవత్సరం, ఆది పెరుక్కు, వైకుంఠ ఏకాదశి, వీరాపూర్ లోని వార్షిక పండుగ, కరూర్ మరియమ్మన్ వార్షిక పండుగ వంటి అనేక పండుగలను అనేకమంది ప్రజలు ఇక్కడికి వచ్చి వీటిని ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో జరుపుకుంటారు.

చరిత్ర మార్గం ద్వారా

సంపదకి, వారసత్వ సంస్కృతికి పేరుగాంచిన కరూర్, తమిళనాడు రాష్ట్రము లోని పురాతన పట్టణాలలో ఒకటి. దీని చరిత్ర సంగం కాలంనాటి 2000 సంవత్సరాల క్రిందటిది. కరూర్ చేర, గంగ, చోళ, విజయనగర నాయకులూ, మైసూర్, బ్రిటిష్ తోపాటి అనేక రాజుల అభివృద్ది, పతనాలను చూసింది.

కరూర్ అనేక శాసనాలు, సాహిత్య రచనలలో కరువూర్, వంజి, అడిపురం, పుపతీచురం, వంసి మూతుర తిరుఆనిలై, వంజులరణ్యం, కరువైప్పటినం, తిరు వితువక్కొట్టం, ముడివలంగు విరచోలపురం, గర్భాపురం, కరపురం, భాస్కరాపురం, ఆడగా మాడం, శంమంగల క్షేత్రం, చేరమ నగర్, కారూర మొదలైన పేర్లని పేర్కొంది. సంగం సమయంలో, ఈ ప్రదేశాన్ని అమరావతి ఒడ్డున నిర్మించారు, దీనిని ఆన్పోరునై అనే పేరుతొ పిలవడం జరిగింది.

బ్రహ్మదేవుడు తన సృష్టిని మొదలు పెట్టింది ఈ ప్రాంతం నుండే అని పురాణాల కధనం, ఈ ప్రాంతాన్ని ‘ప్లేస్ ఆఫ్ సేక్రేడ్ కౌ’ అని పిలుస్తారు. కరూర్ సమీపంలోని ఆరు నట్టార్ మలై లో రాతి శాసనాలపై చేర రాజుల పేర్లు పొందుపరచలేదు.

ఈ పట్టణం ఆభరణాల తయారీ కేంద్రం, వాణిజ్య కేంద్రం. కరూర్ లేదా కోరేవోర కూడా గ్రీకు విద్వాంసుడు టోలెమి రచనలలో పెర్కొన్నవాటిని తెలుసుకుంది. కరూర్ చోళ రాజుల పాలనలో నివశించిన తిరువిచైప్ప గాయకుడు కరువూర్ తేవర్ జన్మస్థలం. 1874 లో బ్రిటిష్ వారు కరూర్ ని పురపాలకసంఘం గా నిర్వచించారు.

కరూర్ చేరుకోవడం ఎలా

కరూర్ కి త్రిచి, కోయంబత్తూర్ సమీప స్థానిక విమానాశ్రయాలు. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నై లో ఉంది. పట్టణానికి నడిబొడ్డున ఉన్న కరూర్ రైల్వే స్టేషన్ తమిళనాడు లోని మిగిలిన ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి ఈ పట్టణానికి రోజువారీ బస్సులలో కూడా నడుస్తాయి. అందువల్ల కరూర్కి తమిళనాడు లోని ఇతర ప్రాంతాలకు తేలికగా అందుబాటులో ఉంటుంది.

కరూర్ వాతావరణం

కరూర్ లో పాక్షిక ఉష్ణమండల వాతావరణం ఉంటుంది, కావున వేసవిలో కరూర్ సాధారణంగా వేడిగా, అలాగే శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతతో, ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో, కరూర్ లో ఒకమాదిరి వర్షపాతం ఉండడం వల్ల ఉష్ణోగ్రత నుండి కొద్ది విరామం దొరుకుతుంది. అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉండే శీతాకాల సమయంలో ఈ పట్టణాన్ని సందర్శించడం ఉత్తమం.

కరూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కరూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కరూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కరూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా తమిళనాడు లోని ప్రముఖ ప్రాంతాల నుండి కరూర్ కు రాష్ట్ర రవాణా బస్సులు అదేవిధంగా ప్రైవేట్ బస్సులు రెండూ నడుస్తాయి. ప్రైవేట్ బస్సులు కొంచెం ఎక్కువ ఖరీదు ఉంటాయి, కానీ పట్టణం లో ప్రయాణం చేయడానికి సౌకర్యవతమైన ఎంపిక కూడా.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా కరూర్, తమిళనాడు లోని మిగిలిన ప్రాంతాలకు రైలు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. రైల్వే స్టేషన్ ;కరూర్ పట్టణానికి నడిబొడ్డున ఉంది. ఈ స్టేషన్ నుండి కరూర్ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలకు టాక్సీలు, ఆటో రిక్షాల ద్వారా తేలికగా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా కరూర్ పట్టణం నుండి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిచి సమీప స్థానిక విమానాశ్రయం. కరూర్ నుండి 126 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయంబత్తూర్ కూడా తేలికగా చేరుకునే విమానాశ్రయం. ఈ రెండు విమానాశ్రయాల నుండి టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. చెన్నై సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. చెన్నై నుండి కరూర్ కి ప్రతిరోజూ బస్సులు, రైళ్ళు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri