కార్వార్ పర్యాటకులు గుడ్డలి శిఖరం తప్పక చూడాలి. ఇది కార్వార్ పట్టణానికి 6 కి.మీ.ల దూరం. ఇది సముద్రమట్టానికి సుమారు 1800 అడుగుల ఎత్తులో కాళీ నదికి పడమటి భాగంలో కలదు. హైదర్ ఘాట్ కొండలలో ఇది అతి పొడవైన శిఖరం. ఈ ప్రదేశానికి వెళ్ళాలంటే పర్యాటకులు అటవీ మార్గంలో 5 మీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి చూస్తే పట్టణం ఎంతో సుందరంగా కనపడుతుంది. స్వాతంత్రానికి ముందర బ్రిటీష్ వారికి ఇది వేసవి విడిదిగా ఉండేదని చరిత్ర చెపుతోంది.