పర్యాటకులు కార్వార్ పట్టణానికి 8 కి.మీ.ల దూరంలో కల మారుతి దేవాలయాన్ని చూడాలి. ఈ దేవాలయాన్ని అనేకమంది భక్తులు సందర్శించి గణపతికి పూజలు చేస్తారు. ఇక్కడ రంగోలి పండుగ ప్రసిద్ధిగాంచింది. ఈ పండుగ సమయంలో ప్రజలు మారుతి దేవాలయ సమీప రోడ్లను ముగ్గులతో అలంకరిస్తారు. దేవాలయం రంగోలితో ఒక ఆర్ట్ గ్యాలరీవలే ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ కొత్త కొత్త ముగ్గు నమూనాలు చూడవచ్చు. రంగోలి డిజైన్లలో వివిధ దేవుళ్ళు, దేవతలు, క్రీడాకారులు, ప్రసిద్ధ నటీనటులు, రాజకీయ వేత్తలు కూడా ఉంటారు.