పర్యటనకు ఉత్తమ సమయం పర్యాటకులు అందమైన ఈ కసౌలి పట్టణాన్ని సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు. కసౌలి వింటర్ లో వింటర్ కార్నివాల్ షో నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో ఇది నిర్వహిస్తారు. ఈ సమయం పర్యటనకు సూచించ దగినది.
కసౌలి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా వుంటుంది. వేసవులు కొద్దిగా వేడిగా, వింటర్ ఆహ్లాదంగా వుంటాయి. ప్రసిద్ధ నవరాత్రి పండుగ టవున్ లో ఎంతో అట్టహాసంగా చేస్తారు. ఈ పండుగే కాక మార్చ్ లో శివరాత్రి, ఆగష్టులో మని మహేష్ జాతర వైభవంగా జరుపుతారు. వేసవి కసౌలి లో వేసవి మార్చ్ లో మొదలై జూన్ చివరి వరకూ కొనసాగుతుంది. ఈ సమయం లో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలుగా వుంటుంది. వేసవి లో ఇక్కడ వెచ్చని పగలు, చలి రాత్రులు వుండి ఆహ్లాదంగా వుంటుంది.
వర్షాకాలం కసౌలి లో వర్షాకాలం జూలై లో మొదలై ఆగష్టు చివరి వరకూ వుంటుంది. ఈ ప్రాంతంలో వర్ష పాతం చాలా తక్కువ. ఆహ్లాదకర వాతావరణం కారణంగా పర్యాటకులు వర్షాకాలం లో కూడా ఇక్కడ పర్యటిస్తారు.
శీతాకాలం శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరకు వుంటుంది. అపుడు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు కనిష్టంగా, 14 డిగ్రీలు గరిష్టంగా వుంటాయి.