షాహీ, హాల్ద్వాని మరియు కత్గోడం నుండి ప్రాంతాల గుండా ప్రవహించే గౌలా నది సట్టాల్ నది నుండి ఉద్భవించింది. ఈ 500 కిలో మీటర్ల పొడవున్న నది ఉత్తరప్రదేశ్ లో ని రాంగంగా నది లో కలిసి ఆ తరువాత పవిత్ర మైన గంగా నదిలో సంగమిస్తుంది. నేల కోత అలాగే చెట్లను నరికివేయుట వంటి కారణాల వల్ల వర్షపాతం తగ్గింది. అందువల్ల ఈ నదీ జలాల స్థాయి తగ్గిపోతోంది. ఈ నది పైన నిర్మించబడిన గౌలా బరేజ్ అనే డ్యాంని పర్యాటకులు పిక్నిక్ స్పాట్ గా ఎంచుకోవచ్చు.