బిల్లవార్ ఒక తాలుకా. బలాఉర్ గా ప్రసిద్ధి చెందినది. బిల్లవార్ టవున్ భిన్ని మరియు నాజ్ అనే ప్రవాహాల ఒడ్డున కలదు. ఈ టవున్ 1598 – 1614 ల మధ్య రాజా భోపాట్ పాల్ చే నిర్మించబడినది. ఇక్కడ అనేక పురాతన టెంపుల్స్, స్మారకాలు కలవు. ఈ ప్రదేశం బసోహ్లి రాజాలుచే పాలించబడినది. మహా బిల్వకేశ్వర్ టెంపుల్ ను గతంలో హరి హర టెంపుల్ అనేవారు. ఇది శివుడి టెంపుల్.
ఇతిహాసాల మేరకు, మహాభారతం నాటి పాండవులు వారి వనవాస చివరి భాగంలో ఇక్కడ నివసించారు. ఇక్కడ బిల్వ చెట్లు అధికం. పాండవులు పూజలు చేసిన చోట శివుడికి గుడి కట్టించారు. పర్యాటకులు ఇక్కడే కల ఒక పురాతన ఆంజనేయుడి విగ్రహం, శివుడి 11వ అవతారంగా చెప్పబడేది, ఇక్కడ చూస్తారు. దీనిని నాజ్ నదిలో కనుగొన్నారు.