శివుడికి చెందిన ఈ దేవాలయం కథువా జిల్లాలో ప్రసిద్ధి. దీనిని గతంలో హరిహర దేవాలయం అనే వారు. దీని చుట్టూ ఈ ప్రదేశంలో అనేక బిల్వ చెట్లు వుండటంచే దీనికి బిల్వకేస్వర్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఇక్కడ భక్తులు బిల్వ దళాలతో శివుడికి పూజలు చేస్తారు.
టెంపుల్ శిఖరం 60 అడుగుల ఎత్తు వుంటుంది. ఈ టెంపుల్ లో గణేశ, బ్రహ్మ, భైరవ, విష్ణు , అయిదు తలల శివుడి విగ్రహాలు వుంటాయి. స్థానిక కదల మేరకు పాండవులు తమ వనవాసం లో ఇక్కడ పూజలు చేసారని చెపుతారు. భక్తులు అధిక సంఖ్య లో ఇక్కడకు వస్తారు.