కెమ్మనగుండిలో పర్యాటకులు హెబ్బే జలపాతాలను తప్పక చూడాలి. ఈ జలపాతాలు షుమారు 168 మీ. ల ఎత్తునుండి పడతాయి. ఇవి ఒక కాఫీ ఎస్టేట్ లో కలవు. ఈ ప్రదేశాన్ని చేరాలంటే, కాలినడకన లేదా నాలుగు చక్రాల వాహనాలపైన కూడా చేరవచ్చు.
జలపాతం ప్రవాహం మద్యలో రెండుగా చీలి పెద్ద చీలిక ‘దొడ్డ హెబ్బె’ గాను చిన్న చీలిక ‘చిక్క హెబ్బే’ గాను ప్రవహిస్తుంది. ప్రశాంత వాతావరణం ఆనందించాలనుకునేవారికి హెబ్బే జలపాతాలు, చుట్టుపట్ల ప్రదేశాలు అనువుగా ఉంటాయి.
పర్యాటకులు ఇక్కడ స్నానాలను కూడా చేయవచ్చు. ఈ జలపాత నీటిలో ఔషధ గుణాలున్నాయని, అవి చర్మ సంబంధిత వ్యాధులను, సాధారణ దగ్గు జలుబులను నివారిస్తాయని కూడా చెపుతారు.
సాహస వంతులైన పర్యాటకులు ఈ జలపాతాలకు ఒక సన్నటి మార్గం ద్వారా కెమ్మనగుండినుండి ట్రెక్కింగ్ లో రావచ్చు. లేదా జీపులలో కూడా తేలికగా ఇక్కడకు చేరవచ్చు.