Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కియో౦ఝర్

కియోంఝర్  – విస్తారమైన భూమి !

17

కియోంఝర్, ఒరిస్సాలోని ఉత్తర సరిహద్దు ప్రాంతం పై ఉన్న అందమైన ప్రదేశం. ఇది రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాలలో ఒకటి, ఇది మునిసిపాలిటీ కూడా. ఈ జిల్లా ఉత్తరం వైపు ఝార్ఖండ్, దక్షిణం, పడమర, తూర్పున జైపూర్, దెంకనల్, మయూర్భంజ్ రాష్ట్రాలతో చుట్టబడి ఉంది. ఇక్కడ వైతరణి నది ఉద్భవించిన చోటు నుండి ప్రసిద్ధ కియోంఝర్ పీఠభూమి ఉంది.

 కియోంఝర్ పర్యాటకం ఏడాది పొడవునా చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశంలో పుష్కలంగా ఫల, పుష్ప జాతులు, ఖనిజ నిక్షేపాలు వున్నాయి. ఈ ప్రదేశంలో అందమైన జలపాతాలు కూడా వున్నాయి. ఇన్ని వైవిధ్యభరితమైన సహజ వనరులున్న జిల్లా రాష్ట్రంలో ఇదొక్కటే. ఈ జిల్లాలో మూడో వంతుకు పైగా దట్టమైన అడవులు వున్నాయి, జిల్లాలో చాలా చోట్ల మాంగనీసు ఖనిజం దొరుకుతుంది. జిల్లాలోని రెబానా, కలపతా బ్లాకుల్లో పులులు వుంటాయి.

కియోంఝర్ పర్యాటకం యాత్రికులకు చాలా ఆకర్షణలు అందిస్తుంది. ఇక్కడి కందదార్ జలపాతాలు, సంఘగర జలపాతాలు, బడా ఘాగర జలపాతాలు ఇక్కడ పర్యాటకులకు ఆసక్తి కలిగించేవి. ఘటగావ్ లో వున్న దేవాలయం మరో ప్రధాన ఆకర్షణ. ఈ ప్రసిద్ధ దేవాలయాన్ని ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శిస్తారు. గోనసిక, గుండిచఘై, భీమ్ కుండ్, ముర్గమహదేవ్ దేవాలయం, జిల్లా మ్యూజియం కూడా ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు. అతి పురాతన శివాలయం వున్న చక్రతీర్థ కూడా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.

సీతా బింజ్, రాజానగర్ కూడా కియో౦ఝర్ పర్యాటకంలో ప్రసిద్ధ చారిత్రిక ఆకర్షణ. రాజానగర్ లో కియో౦ఝర్ పాత రాజుకు చెందిన ప్రాచీన రాజభవనం శిధిలాలు వున్నాయి. ఇక్కడ దాదిబామన్ యూదుల దేవాలయం, రఘునాథ్ యూదుల మాత దేవాలయం కూడా వున్నాయి. ప్రతి ఏటా శీతాకాలంలో చాలా జాతులకు చెందిన వలస పక్షులు రాజానగర్ లోని చదేయి కుదూర్ కు చేరుకుంటాయి. ఒకప్పటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం దేవగావ్ కుశాలేశ్వర్ ఇక్కడ వున్న కుశాలేశ్వర్ దేవాలయానికి ప్రసిద్ది చెందింది.

కియో౦ఝర్ : ప్రాచీన వైభవ పునరుద్ధరణ

జువాంగ్స్, భుయాన్స్ అనే రెండు జాతులు ఈ ప్రాంతం ప్రాచీన వైభవ పునరుద్ధరణ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చాలా ప్రాచీనమైన ఈ రెండు జాతులు ఇక్కడి అసలైన నివాసులు.

కియోంఝర్ ను సందర్శించడానికి ఉత్తమ సమయం

వాతావరణం మధ్యస్తంగా వుండే నవంబర్ లో చాలా మంది కియోంఝర్ ను సందర్శిస్తారు.

కియోంఝర్ ఎలా చేరుకోవాలి ?

కియోంఝర్ ను నవంబర్ లో చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని చూడడానికి ఇది ఉత్తమ సమయం. ఈ ప్రాంతానికి వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు. భువనేశ్వర్ లోని బిజూ పట్నాయక్ విమానాశ్రయం ఇక్కడికి సమీపంలో వుంది, జె కే రోడ్ రైల్వే స్టేషన్ ద్వారా కియోంఝర్ చేరుకోవచ్చు.

కియో౦ఝర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కియో౦ఝర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కియో౦ఝర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కియో౦ఝర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా కియోంఝర్ బాగా అనుసంధానించబడిన ప్రదేశం. ఇది రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలూ, పట్టణాలతో బాగా అనుసంధానించబడి ఉంది. జిల్లాను అనుసంధానించే 5 వ నంబరు జాతీయ రహదారి ఎటువంటి సమస్య లేకుండా ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి ప్రైవేట్ కార్లు, బస్సులు ఉంటాయి. ఈ ప్రదేశం వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాలతో కూడా బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *కియోంఝర్ లో రైల్వే స్టేషన్ లేదు రైలులో కియోంఝర్ చేరుకోవడానికి, 114 కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న జె.కె. రోడ్ రైలుకేంద్రం కి వెళ్ళాలి. ఈ రైల్వే స్టేషన్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో బాగా కలుపబడి ఉంది, రైల్వే స్టేషన్ నుండి కియోంఝర్ చేరుకోవడానికి కేవలం రెండు గంటలు మాత్రమే పడుతుంది. కియోంఝర్ చేరుకోవడానికి ప్రైవేట్, రాష్ట్ర బస్సులు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా భువనేశ్వర్ లోని బిజు పట్నాయక్ సమీప విమానాశ్రయం నుండి కియోంఝర్ చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది, కియోంఝర్ జిల్లా చేరుకోవడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే పడుతుంది. ఈ ప్రదేశం భువనేశ్వర్ విమానాశ్రయం నుండి 269 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri