హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న గేముర్ విహారం 700 ఏళ్ళ నాటిది. కీలాంగ్ లోని భాగా లోయ లో వున్న ఈ గోమపా గేముర్ గ్రామానికి 600 నుంచి 700 గజాల ఎత్తున వుంటుంది. ప్రతి ఏటా జూలై నెలలో ఈ విహారం లో ఒక ‘భూత నృత్యం’ ఏర్పాటు చేస్తారు. 11 వ శతాబ్దానికి చెందిన మారిచి, వజ్రవారాహి దేవతల విగ్రహాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ – ఈ దేవతలు హిందూ దేవత వారాహి నుంచి వచ్చారని నమ్ముతారు.