హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ వద్ద వున్న సిస్సు అనే ప్రముఖ గ్రామం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కూడా. సముద్ర మట్టానికి 3100 మీటర్ల ఎత్తున చంద్రా నది ఒడ్డున వున్న సిస్సు గ్రామంలో విల్లో చెట్ల తోటలు దట్టంగా రోడ్డుకి ఇరువైపులా వుంటాయి. సూర్యరశ్మి కూడా దూరలేనంత దట్టంగా వుంటాయవి.
ఆలూ, బఠాణీ, గోధుమ, బార్లీ తో పాటు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో వుండే అడవి గులాబీలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ గ్రామం వెనుకే గ్యేఫాంగ్ శిఖరం కూడా వుంది. లాహౌల్ దేవతగా భావించబడే గ్యేఫాంగ్ దేవుడి పేరిట ఈ శిఖరానికి పేరు పెట్టారు. ఈ గ్రామానికి కొద్ది దూరంలో గ్యేఫాంగ్ శికారం లోని మంచు ఖండాల నుంచి సిస్సు కాలువ ప్రవహిస్తుంది. 11, 12 శతాబ్దాలకు చెందిన రెండు పాత ఫౌంటెన్ పలకలు ఇక్కడి మరో ప్రధాన ఆకర్షణ. పైగా పర్యాటకుల సౌకర్యార్ధం ఇక్కడ ఒక PWD వసతి గృహం కూడా వుంది.