Search
  • Follow NativePlanet
Share

ఖజురహో - రాతి మీద ప్రేమ కథ !

131

ఖజురహో మధ్య ప్రదేశ్లోని బున్దేల్ఖండ్ ప్రాంతంలో ఉన్నది. ఇది వింధ్య పర్వత శ్రేణులకు వ్యతిరేకదిశలో ఉన్న కుగ్రామాల సముదాయం. ఖజురహో గొప్ప దేవాలయాలను కలిగి ఉన్నందున, ఈ గ్రామం పేరు ప్రపంచపటంలోకి ఎక్కింది. ఇక్కడ ఇసుకరాళ్ళతో మలచబడ్డ దేవాలయాలు, మరియు ప్రత్యేకమైన మరియు శృంగారభరితమైన శిల్పాలతో ఖజురహో పర్యాటకరంగం అభివృద్ధి చెందుతున్నది.

ఖజురహోలో మరియు దాని చుట్టూ ఉన్నపర్యాటక ప్రదేశాలు

ఖజురహో దేవాలయాల శిల్పాలలో అన్ని రూపాలలో ఉన్న ప్రేమ మరియు కీర్తిని ప్రతిబింబిస్తుంటాయి. ఖజురహోలో చుసాథ్ యోగిని దేవాలయం, జవారి దేవాలయం, దేవి జగదాంబ దేవాలయం, విశ్వనాథ దేవాలయం, కండారియ మహాదేవ దేవాలయం, లక్ష్మణ దేవాలయం మరియు ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే ఖజురహో డాన్స్ ఫెస్టివల్ చాలా పెద్ద ఆకర్షణ. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 2 వరకు జరుగుతుంది. వారమంతా జరిగే ఈ పండుగకు భారతదేశంలోని అనేక కళాకారులు మరియు ప్రదర్శకులు వొస్తారు.

ఖజురహో-వారసత్వానికి చిహ్నం

ఖజురహోలోని దేవాలయాలను క్రి.శ. 950-1050లలో ఇండియా మధ్యభూభాగాన్ని పరిపాలించిన చందేల పాలకులు కట్టించారు. ఖజురహోలో ఉన్న 85 దేవాలయాలలో కేవలం 22 దేవాలయాలు మాత్రం కాలగమనంతో పాటు జీవించి ఉన్నాయి. మానవ భావోద్వేగాలను రాతిమీద మరియు అందమైన శిల్పాల రూపాలలో నమ్మలేనివిధంగా మలిచి, ప్రపంచ ఊహాత్మక శక్తిని ఆకర్షింపచేశారు. ఈ దేవాలయాలను 1986లో యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించారు.

ఖజురహో-ఎ సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్

ఖజురహో కళ మరియు శిల్పాలు, ఇవి జీవిత సారాంశాలు. ఇక్కడ ఉన్న నిర్మాణశైలి మరియు శోభ అంతా మానవు సృజనాత్మకత మరియు జీవిత సంతోష చాయలకు ప్రతిరూపాలు. ఈ దేవాలయాలలో ఉన్న శిల్పకళ అంతా శృంగారభరితమైనదిగా పరిగణించినా, వాస్తవానికి ఇవి హిందూ దేవతలకు అంకితం చేయబడ్డాయి. వీటిని భారతదేశంలో ఉన్న ఏడు వింతలలో ఒకటిగా భావిస్తారు.

ఖజురహో-రాతి మీద వైవిధ్యం ఉన్న సృజనాత్మకత

ఖజురహో దేవాలయాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి తూర్పు, పడమర మరియు దక్షిణం. పడమటి గ్రూపులో మొత్తం హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ అత్యుత్తమ నిర్మాణ శోభకు ప్రతీకగా నిలిచాయి. వీటిలో అద్భుతమైనది మరియు పెద్దది కండారియ మహాదేవ ఆలయం.

తూర్పు గ్రూపులో హిందూ మరియు జైన దేవాలయాలు ఉన్నాయి. ఇవి పశ్చిమదేవాలయాల వలె ఎక్కువ శిల్పకళతో లేకపోయినా, వాటి సొంతమైన కళ మరియు శోభతో అలరారుతున్నాయి. ఇందులో పార్శ్వనాథ్ జైన దేవాలయం పెద్దది. ఇక దక్షిణ గ్రూపులో కేవలం రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దులడియో దేవాలయం మరియు చతుర్భుజ్ దేవాలయం. ఈ దేవాలయాలలో పునరుద్ధరించబడిన శిల్పాలు కాని మరియు మిగతా దేవాలయాలలో ఉన్న నిర్మాణశైలి కాని కనపడవు.

ఖజురహో ఎలా చేరుకోవాలి?

ఖజురహోకు అన్ని మార్గాల ద్వారా అనుసంధాన వ్యవస్థ ఉన్నది. ఈ పట్టణంలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ మరియు బస్సు-స్టాండ్ ఉన్నాయి. పట్టణమంతా తిరిగి చూడటానికి టాక్సీలు, రిక్షాలు మరియు సైకిళ్ళు అందుబాటులో ఉన్నాయి.

ఖజురహో సందర్శనకు ఉత్తమ సమయం

శీతాకాలం, అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలమైన సమయం.

ఖజురహో ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఖజురహో వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఖజురహో

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఖజురహో

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం: ఖజురహో బస్సు సేవలు ద్వారా అనేక పెద్ద మరియు చిన్న నగరాలు మరియు మహోబా, జబల్పూర్, భూపాల్, ఝాన్సీ, ఇండోర్, గౌలియార్, మొదలైన పట్టణాలకు అనుసంధించబడి ఉన్నది. ఖజురహో నుండి ఈ ప్రదేశాలకు ప్రైవేటు మరియు రాష్ట్ర రవాణా బస్సులు అందుబాటులో ఉన్నాయి. సందర్శకులు ఖజురహో నుండి సాధారణ, AC, నాన్ AC, డీలక్స్ మరియు సూపర్ డీలక్స్ బస్సుల సౌకర్యాలను పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : ఖజురహో రైల్వే స్టేషన్ ఝాన్సి అనే చిన్న గ్రామానికి మరియు కొన్ని నగరాలకు అనుసంధించబడి ఉన్నది. ఖజురహో నుండి 73 కి.మీ. దూరంలో పెద్ద రైల్వే స్టేషన్, మహోబా ఉన్నది. మహోబా నుండి ఖజురహోకు టాక్సి ద్వారా చేరుకోవటానికి రూ.1200/- అవుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం: ఖజురహోలో విమానాశ్రయం ఉన్నది. పట్టణానికి 5 కి.మీ. దూరంలో ఈ విమానాశ్రయం ఉన్నది. ప్రధాన విమానయాన సంస్థలు దేశంలోని ప్రధాన నగరాలకు ప్రజలను ఈ విమానాశ్రయం నుండి రవాణా చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న సౌకర్యాలు మరియు నిర్మాణం అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat