డకోర్ లోని వివిధ దేవాలయాలు (శాంతారాం మందిరం, లక్ష్మీ దేవి గుడి, శ్రీ సత్యనారాయణ దేవాలయం, పునితాశ్రం, గాయత్రి దేవి గుడి, మహాప్రభుజీ నీ భేఠక్) : డకోర్ లో ఎన్నో గుళ్ళు వున్నాయి, ఎన్నంటే దీన్ని గుళ్ళ నగరం గా కూడా పిలువవచ్చు. డకోర్ లో చూడదగ్గ ఆసక్తికరమైన దేవాలయాల్లో కొన్ని : శాంతారాం మందిరం, లక్ష్మీ దేవి కోసం నిర్మించిన పెద్ద అందమైన గుడి.
శిఖరం ప్రత్యేకత వల్ల సత్యనారాయణ దేవాలయం ప్రసిద్ది పొందింది.
పునీతాశ్రం ద్వారా జరిగే సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రసిద్ది పొందింది – ముఖ్యంగా వికలాంగుల కోసం ఉద్దేశించిన ఆశక్తాశ్రం, వృద్ధుల కోసం నిర్మించిన వృద్దాశ్రం. కొత్తగా కట్టిన గాయత్రి దేవాలయం, వైష్ణవులు విరివిగా దర్శించే 84 పీఠాల్లో ఒకటైన మహాప్రభుజీ ని బేఠక్ కూడా చూడదగ్గవి.