చండిక ఆలయం, ఇది కిన్నౌర్ లో ఉన్న 'కోఠి' అనే గ్రామంలో ఉన్న బహుళ ప్రాచుర్యం ఉన్న మత కేంద్రం. దీనినే 'షువాంగ్ చండిక' అని కూడా అంటారు, ఇక్కడి దేవత చాలా మహిమకలది అని స్థానికుల నమ్మకం. ఇక్కడి దేవతావిగ్రహాన్ని బంగారంతో చేసారు మరియు దేవత మందసములో కూర్చుని ఉన్నది. పూజ సమయంలో, ఇక్కడి దేవత నలుగురు జనాలతో ఫైకి. క్రిందకి నాట్యం చేస్తుంది.
ఇతిహాసం ప్రకారం, రాక్షస దేవుడి లేదా రాజు యొక్క 18 మంది పిల్లలో ఒకరు చండిక. అతను కిన్నార్ అధ్యక్షుడిగా ఉండి మరియు అతని పెద్ద కూతురు 'చండిక', సైరగ్ కు, కిన్నౌర్ కు గుండె వంటిది; అధ్యక్షురాలిగా ఉన్నది. చరిత్ర ఇంకా ఇలా చెపుతున్నది, చండిక తన యొక్క సోదరుడి సాయంతో ఆ ప్రాంతం యొక్క ఆధిపత్యం కోసం ఒక రాక్షసుడితో పోరాటం జరిపిందని.