చాన్గో దేవాలయాలు,కిన్నౌర్ జిల్లాలో చాన్గో గ్రామంలో ఉన్నాయి. ఇక్కడికి దేశవిదేశాలనుండి పర్యాటకులు వొస్తుంటారు. ఈ గ్రామం అత్యద్భుతమైన, పవిత్రమైన దేవాలయాలకు మరియు యాపిల్ తోటలకు పేరుగాంచింది. ఈ గ్రామానికి చెందిన స్థానికులు ఎక్కువ మంది బౌద్ధమతం అనుసరిస్తారు, మరికొందరు హిందూ మతం ఆచరిస్తారు. కొంతమంది హిందూ మత దేవుళ్ళ పేర్లు గ్యల్బో, యాల్స మరియు దాబ్ల. ఇక్కడ ముఖ్యంగా మూడు దేవాలయాలు ఉన్నాయి, అందులో ఒకటి 'లోయర్ చాన్గో' లో ఉన్నది. దూరం నుండి కూడా ఈ ఆలయ ఎరుపు రంగు గోడలను చూడవొచ్చు.
ఇక్కడ ఇంకొక గ్రామ దేవాలయం కూడా ఉన్నది. దీనిలో గోడలు చిత్రపటాలతో, మట్టి విగ్రహాలు మరియు ఒక పెద్ద ప్రార్ధనా చక్రాన్నికూడా చూడవొచ్చు. ఈ రెండు గుడుల మధ్య దారిలో వంపుగా ఉన్నఒక పెద్ద రాయి రూపంలో ఉన్న బుద్ధ దేవుడు, 'అవలోకితేశ్వర' ను చూడవొచ్చు. ఇంకొక దేవాలయం అప్పర్ చాన్గో లో ఉన్నది, ఇది అన్ని దేవాలయాలకన్నా చాలా అందంగా ఉంటుందని అంటారు. ప్రయాణికులు ఇంకా ఆలయ సమీపంలో ప్రార్థన హాల్, గెస్ట్ రూమ్స్ మరియు గ్రంథాలయాన్ని చూడవొచ్చు.