లిప-అస్రంగ్ అభయారణ్యం, ఇది 4000 నుండి 5022 ఎత్తులో కిన్నౌర్ జిల్లాలో ఉన్నది. దీని ఏరియా సుమారు 30.89 చ.కి.మీ. ఉన్నది. ఈ అభయారణ్యాన్ని 1962 లో మరియు 1974 లో గుర్తించారు. దీని ఏరియా చాలా పెద్దది మరియు సమతలంగా ఉంటుంది మరియు దీనిలో కొంత ప్రాంతం నిస్సారమైన శీతల ఎడారిగా ఉన్నది. ఈ అభయారణ్యంలో మరుగుజ్జు జునిపెర్ పొదలు, పొడి ఆల్పైన్ పొదలు, పశ్చిమ హిమాలయ సమశీతోష్ణ అడవులు, శంఖాకార అడవులు, ఎండు శంఖాకార అడవులు, మరియు ఎండు విస్తృతాకారంలో ఉన్న ఆకులతో ఉన్న అడవులు ఉన్నాయి.
ప్రయాణికులు ఇక్కడ నీలిరంగు గొర్రెలు, బ్రౌన్ ఎలుగుబంటి, చిరుతపులులు, ఐబెక్స్, దుప్పి, హిమాలయాల నల్ల బీర్, గోరల్స్, మరియు పొడవాటి వెంట్రుకలు ఉన్న బర్రెలను చూడవొచ్చు.ఏప్రిల్ మరియు అక్టోబర్ నెలల మధ్య ఉన్న సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి అనుకూలంగా ఉంటుంది మరియు ఈ సమయంలో చాలా రకాల జున్తువులను చూడవొచ్చు. ఈ అభయారణ్యాన్ని సందర్శించటానికి పర్యాటకులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.