నాకో సరస్సు, ఇది కిన్నౌర్ లోని ఒక చిన్న కుగ్రామమైన 'నాకో'లో ఉన్నది. ఇది హన్గ్రంగ్ లోయకు 2 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ సరస్సు సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సరస్సు నాలుగు అందమైన దేవాలయాలతో మరియు అనేక చెట్లతో చుట్టూ ముట్టబడి, దీని అందం ద్విగుణీకృతమైంది.
ఇక్కడ పాదం లాంటి గుర్తు ఉన్నది, జానపద కథనం ప్రకారం ఇది న్యింగ్మ పాఠశాల వారిచే రెండవ బుద్ధుడు అని పిలువబడ్డ 'గురు పద్మసంభవ' పాద ముద్ర అని అంటుంటారు. ఈ ప్రాంతంలో గుర్రాలు మరియు యాక్స్ వంటి జంతువులను కూడా చూడవొచ్చు. ఈ ప్రాంత గ్రామస్థులు 'డేఒడుం' అనే దేవుడిని పూజిస్తారు. ఈ గ్రామం నుండి పార్గిఅల్ పర్వత శిఖరానికి అధిరోహణం ద్వారా చేరుకోవొచ్చుమరియు తశిగాంగ్ ఆశ్రమం మార్గంలో వస్తుంది.