ఎర్నాకుళ తప్పన్ దేవాలయం ఒక శివ దేవాలయం. గుడి పడమటి దిశగా తిరిగి ఉంటుంది. కేరళ శిల్ప శైలిలో నిర్మించారు. జనవరి, ఫిబ్రవరి నెలలలో ఉత్సవాలు జరుగుతాయి.
ఈ వేడుకలలో చక్కగా అలంకరించిన ఏనుగులను వినియోగిస్తారు. ఇక్కడ జరిగే ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా యాత్రికులు వస్తారు. రోడ్డు మార్గంలో ఈ దేవాలయం తేలికగా చేరవచ్చు.