కుమ్బలంగి ఇంటిగ్రేటెడ్ టూరిసం విలేజ్ , ఇది ఓక చిన్న ద్వీపం ఫై ఉన్నకుమ్బలంగి ఊరులో చేబట్టిన ఒక ప్రాజెక్ట్. కొచ్చి కి 15 కిలోమీటర్ల దూరం లో ఉంది ఈ ఊరు.ఇక్కడ ప్రారంభించిన పర్యాటక అభివృద్ధి విశేషాల వల్ల పర్యాటక ప్రాంతం గా ఇది ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నిక కలిగినది. ఇక్కడి ప్రశాంత బ్యాక్ వాటర్స్ బోటు షికారు ఇంకా చేపలు పట్టటానికి అత్యత్తమ అనువయిన ప్రదేశం.
ఇక్కడి పర్యాటక మరియు నావికా విభాగాలు "కుమ్బలంగి ఇంటిగ్రేటెడ్ టూరిసం విలేజ్" ప్రాజెక్ట్ వల్ల చాల లాభ పడ్డాయి, ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ కుమ్బలంగి చేపలు పట్టటానికి, ఇంకా పర్యాటకులని ఆకర్షించే ఒక గొప్ప పర్యాటక ప్రదేశం గా రూపాంతరం చెందింది.
ఇక్కడికి వొచ్చే పర్యాటకులు ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి పులకరిస్తారు, అంతేకాక ఇక్కడి బ్యాక్ వాటర్స్ లో పడవ షికారు తో మరపురాని అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. చేపల పెంపకం, కొబ్బరి నార వడకటం మున్నగు ఎన్నో విశేషాలను కూడా పర్యాటకులు ఇక్కడ వీక్షించవచ్చు.బ్యాక్ వాటర్స్ లో ప్రయాణం ( పగలు పడవ షికారు మరియు రాత్రి పడవ షికారు పాకేజీలు) ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల పాకేజీలు ఈ కుమ్బలంగి ఇంటిగ్రేటెడ్ టూరిసం విలేజ్ ప్రాజెక్ట్ వారు ఈ ప్రాజెక్ట్ లో భాగం గా నిర్వహిస్తారు.
ఈ కుమ్బలంగి ఊరు ని సంవత్సరం లో ఎప్పుడైనా పర్యటించవచ్చు, కానీ మాన్సూన్ సమయం లో మినహాయించటం మంచిది.