కొచ్చి లో ఉండే ఉత్సాహపూరితమైన ప్రదేశాలలో ప్రిన్సెస్ స్ట్రీట్ ఒకటి. పురాతన కాలం యొక్క మునుపటి కీర్తి వైభవాలని ఈ స్ట్రీట్ సందర్సన ద్వారా పర్యాటకులకి గుర్తుచేస్తాయి. బ్రహ్మాండమైన కొలోనియల్ భవనాలని మరియు విలక్షణమైన యూరోపియన్ నిర్మాణ శైలిని ఇక్కడ గమనించవచ్చు. వైవిధ్య డచ్ ,బ్రిటిష్ ,ఫ్రెంచ్ మరియు పోర్చుగీసు నిర్మాణ శైలిలో నిర్మితమైన పురాతన భవనాలు కట్టడాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి అంతే కాక ఇక్కడి వాతావరణం పర్యాటకులకు ఒక యూరోపియన్ స్థావరం యొక్క సందడి వాతావరణాన్ని కలగచేసి ఆ అనుభవాలతో ముగ్ధులను చేస్తుంది .
ఈ వీధి షికారుకు షాపింగ్ (వస్తువులు కొనుక్కోటానికి) కు చాలా అనువైన స్థానం. ఇక్కడి వినోద విశేషాల వల్ల వ్యాహ్యాళి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ప్రిన్సెస్ స్ట్రీట్ లో ఉన్న అనేక ఫుడ్ పాయింట్స్ ఇంకా కాఫీ షాపులు పర్యాటకులు షికారులో ఆకలి తీర్చుకోటానికి ఆహ్లాదాన్ని పెంచటానికి తోడ్పడతాయి.
దారి పొడవునా ఉండే నగల దుకాణాలు, బట్టల దుకాణాలు, విలక్షణమైన హస్థ కళావస్తువుల దుకాణాలు పర్యాటకులకు మరపురాని షాపింగ్ అనుభూతులని పంచుతాయి. అంతే కాక ఇక్కడ స్పాలు ,సంప్రదాయక ఆయుర్వేద కేంద్రాలు మరియు కళా వస్తు దుకాణాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ఈ స్ట్రీట్ లోని లోఫర్స్ కార్నర్ పర్యాటకులను అపరిమితమైన వినోదాలతో కట్టిపడేస్తుంది.కొచ్చి లోని కొన్ని "పాత కొత్తల" మేలుకయికలు గల విశేషమైన ప్రదేశాలలో ప్రిన్సెస్ స్ట్రీట్ ఒకటి.