Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » వాతావరణం

కొచ్చి వాతావరణం

అత్యుత్తమ సమయం కొచ్చి లో పర్యటనకి అత్యుత్తమ సమయం నవంబెర్ నెల నుండి ఫెబ్రవరి నెల మధ్య వరకు. ఈ సమయం లో వాతావరణం ఏంతో ఆహ్లాదం గా మనోహరంగా వుంటుంది. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సమయం కొచ్చిని చూడటానికి ఉత్తమమని చెప్పవచ్చు , ఎందుకంటే ఈ సమయం లో అనేక ఉత్సాహవంతమైన కార్యక్రమాలతో నగరం సందడిగా ఉంటుంది.అయితే మీరు ప్రశాంతమైన వాతావరణం కోసం చూస్తుంటే మాత్రం క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పండగల సందడి ముగిసాక పర్యటించండి.

వేసవి

ఎండాకాలం ఎండాకాలం లో కొచ్చి వాతావరణం బాగా వేడిగా , పొడిగా ఉంటుంది. బయటి ప్రదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎండాకాలం లో ఇక్కడి వాతావరణం ఇబ్బంది పెట్టొచ్చు, ఎందుకంటే అప్పుడు వేడి మరియు హుమిడిటి (గాలి లో నీటి శాతం ) ఏప్రిల్, మే నెలలలో ఎక్కువగా ఉండవచ్చు. ఈ నెలలలు పర్యటనకు అంతగా అనువుగా ఉండదు.    

వర్షాకాలం

వర్షాకాలం మాన్సూన్ కాలం లో కొచ్చి లో ప్రయాణం కొంచెం కష్టం. జూలై,ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలలో ఇక్కడ భారి వర్షపాతం నమోదవుతుంది. మాన్సూన్ వల్ల నగరం ఆకుపచ్చగా మారిపోతుంది , కానీ వర్షాల వల్ల పర్యాటక ప్రదేశాలను చూడటం , వాటర్ స్పోర్ట్స్ లో పాల్గొనటం కుదరకపోవచ్చు.కొచ్చి పర్యటనని ఈ నెలలో మినహాయించటం మంచిది.    

చలికాలం

చలి కాలం అదృష్టవశాత్తు చలికాలం కొచ్చి యొక్క భౌగోళిక వాతావరణం వల్ల పర్యాటకులకు కన్నుల పండగగా ఉంటుంది. డిసెంబర్, జనవరి మరియు ఫెబ్రవరి నెలలు ఇక్కడ చలి కాలం. ఈ మాసల లో కొచ్చి మనోహరంగా ప్రశాంతం గా ఉంటుంది. సాయం సమయాన పర్యటనకు లైట్ జాకెట్ ( స్వెటర్) వంటివి వెంట ఉంచుకుంటే ఇక్కడి చలికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మాసాలలో పర్యాటకులు ఎటువంటి అడ్డంకులు లేకుండా వాటర్ స్పోర్ట్స్ లో ఇంకా బహిరంగ ప్రదేశాల ని సందర్శించటం వంటి సంతోషాలని చవిచూడొచ్చు.