పర్యాటకులు నౌక నిర్మాణ విధానాన్ని పరిశీలించే వీలు గల అలుంకడవు నౌకా నిర్మాణ ప్రాంగణం ఒక విలక్షణ పర్యాటక ప్రాంతం. కొల్లాం కి 23 కి.మి. దూరం లో తీర ప్రాంతం లో ఉన్న అలుంకడవు అనే చిన్న గ్రామం నౌకా నిర్మాణ పరిశ్రమ కారణం గా యావత్ భారత దేశ దృష్టి ని ఆకర్షించింది.
కెట్టువల్లం అనేది కేరళ లో కయ్యి నీటి విహారం లో ని ఒక ప్రత్యేకత. మొదట్లో ఇది రవాణా నౌక లా తయారు చేయబడ్డప్పటికీ ఇప్పుడు బెడ్ రూం, కిచెన్, బాల్కనీ వంటి అన్ని ఆధునిక వసతులూ కలిగి ఉన్నాయి. ఈ గ్రామ నౌకానిర్మాణ కార్మికులు తమ నైపుణ్యాన్ని తరం నుంచి తరానికి అందిస్తున్నారు.
కేవలం సాంప్రదాయక నౌక నిర్మాణ పద్దతులు మాత్రమే ఉపయోగిస్తూ ఏ ఆధునిక యంత్రాలనీ వీరు ఉపయోగించకపోవడం సందర్శకులని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మామూలు చెక్కముక్కలు కళ్ళెదుటే అద్భుతమైన నౌకాభాగాలు గా తయరవడం వీక్షించడం ఒక చక్కటి అనుభవం.