మహాత్మా గాంధి బీచ్ అని కూడా పిలవబడే ఈ బీచ్ ఇసుక తీరాలు చూసి తీరాల్సినవి. కొల్లాం నగర కేంద్రానికి 2 కి.మి దూరం లోని కోచుపిలమూడు దగ్గర ఈ బీచ్ ఉంది. బీచ్ ని ఆనుకుని ఉన్న మహాత్మా గాంధి పార్క్ కూడ సందర్శకులు సేదదీరడానికి అనువైన ప్రదేశంగా ఉంది.
సూర్య కిరణాలు తాకుతున్న ఆ తీరాలు, తాటి చెట్లు, మిలమిల మెరిసే ఇసక రేణువులతో కూడిన మనోహరమైన ఈ బీచ్, పార్క్ సందర్శకులుని అకట్టుకుంటాయి. సందర్శుకలు సాయంత్రం వేళ లో ఇక్కడికి వచ్చి పునరుత్తేజం పొందుతారు. ప్రశాంతంగా, నిర్మలంగా ఉండే ఈ బీచ్ పరిసర ప్రాంతాలు ఒక చక్కటి హాలిడే స్పాట్ అవుతాయి.
చక్కటి బడ్జెట్ లోనే వచ్చే హోటల్స్, రిసార్ట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. బీచ్ కూడా ఈదటానికీ, స్నానం చేయడానికీ అనువుగానే ఉంటుంది. రోజువారీ అలసట అంతా తీసివేసి శరీరాన్ని చక్కటి శక్తి తో నింపడానికి ఈ బీచ్ లో సాయంత్రం గడపటం పర్యాటకులకి అలవాటు.