కొల్లాం కి 55 కి.మి. దూరం లో ఉండి కొల్లాం, అలప్పుళ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ చిన్న పట్టణం మతపరమైన స్థలం గానూ, యాత్రాకేంద్రంగానూ ప్రసిద్ది. ఎన్నో ప్రాచీన గుళ్ళు, చారిత్రక స్తూపాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాంతం లోని ఓచిర గుడి లేదా పరబ్రహ్మ గుడి ని ఎక్కువగా యాత్రికులు సందర్శిస్తుంటారు.
కేరళ లో ని ఇతర గుళ్ళకి భిన్నంగా ఇది పరబ్రహ్మకి, ఓంకారానికి అర్పితమైంది. 36 ఎకరాల్లో విస్తరించిన ఈ గుడి కి దక్షిణ భారతం లోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. ప్రాచీన కాలం లో జరిగిన ఒక యుద్దాన్ని స్మరించుకునే ఓచిర కలి అనే ఉత్సవం సాధారణంగా జూన్- జూలై లో జరుగుతుంది.
ఈ ఉత్సవ సందర్భంగా జరిగే కత్తిపోరాటాలు, పశువుల సంత భక్తుల్ని, పర్యాటకులని సమానంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి మరొక ముఖ్య మత పరమైన స్థలం ఓచిర ముస్లిం మసీద్ చారిత్రక ప్రాముఖ్యత గల ఒక ప్రాచీన స్తూపం.