మస్తి కట్టే లో అడవి దేవతలుంటారు. ఇక్కడ పైన కప్పులు, లేదా నివాసాలు ఇక్కడి దేవతా విగ్రహాలకు ఉండవు. నిత్య పూజలు స్ధానిక పూజారులు నిర్వహిస్తారు. ఈ దేవాలయ దేవతలకు వ్యాధులను ప్రత్యేకించి పిల్లల వ్యాధులను నివారించే మహిమలుంటాయని చెపుతారు. ఊయలలు, పూవులు, గాజులు, గంటలు వంటివి దేవాలయ దేవతలకు అర్పిస్తారు. దేవాలయం చుట్టూ కల సుందర వాతావరణాన్ని పర్యాటకులు ఆనందించగలరు.