బిలాస్పూర్ అంబికాపూర్ జాతీయ రహదారిపై ఉన్న కేండై గ్రామం ఒక అందమైన విహార కేంద్రం. ప్రసిద్ధ కేండై జలపాతాలు కోర్బా లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ జలపాతం 75 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ జలపాతం చుట్టూ ఉన్న దట్టమైన పచ్చదనం సందర్శకులకు మనోహర దృశ్యాన్ని అందిస్తుంది. ఈ ప్రాంతంలో బులిసిద్ ల పురాతన గుహలు కూడా ఉన్నాయి.