నెహ్రు పార్క్ కోటగిరికి 3 కి.మీ.ల దూరంలో కలదు. ఇది ఒక ప్రైవేటు పార్క్. దీనిలో పర్యాటకులకు అనేక కార్యక్రమాలు లభిస్తాయి. పార్క్ లోపల కోట తేగల టెంపుల్ వుంటుంది. ఇక్కడ ఒక సమావేశ స్థలం కలదు. ఈపార్క్ ను మన జాతిపిత మహాత్మా గాంధికి అంకితం ఇచ్చారు. ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ కూడా కలదు. కొన్ని ఇన్ డోర్ ఆటలు కూడా కలవు. ఒక ఫ్లడ్ షెల్టర్ కలదు. ప్రధానంగా ఈ పార్క్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం మార్చ్ నుండి జూన్ వరకూ ఒక ఫ్లవర్ షో పార్క్ లోపల నిర్వహిస్తారు. దీనిలో నీలగిరిలో లభించే ప్రత్యేక గులాబీలు వంటి అరుదైన పూవులు ప్రదర్శిస్తారు. కూరగాయల ప్రదర్సన కూడా నిర్వహిస్తారు. ఉత్తమ కూరల ఉత్పతి దారులను ఎంపిక చేస్తారు.