కోవలం దగ్గరలోని ఒక చేపల గ్రామ తీరం వెంట వుండే అతి ప్రాచీన చర్చి అనలోద్భవ మాత చర్చి. ఇది కోవలం తీరాల నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో వుండి ఆ ప్రాంతపు రమణీయ దృశ్యాలను కళ్ళకు కడుతుంది. దట్టమైన పచ్చని అడవుల్లో హాయిగా నిలబడి వుంది ఈ చర్చి. వర్షాకాలంలో ఐతే ఈ ప్రాంతం దాదాపు ఇతిహాసాల్లో చెప్పినట్టుగా వుంటుంది.ఈ చర్చి నుంచి కొద్ది దూరం నడిచి వెళ్తే – చేపల వేట ప్రధాన జీవనోపాధిగా వున్న తీరాలు, చిన్న గ్రామాలు మీకు దర్శనమిస్తాయి. ఈ చర్చికి దగ్గరలోని తీరం గురించిన ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కేరళలో సముద్రపు కోతను తట్టుకుని కూడా దెబ్బ తినకుండా వున్న చర్చి ఇది ఒక్కటే. ఇక్కడ సముద్రపు నీరు వెనకకు పోతూ వుండడం వల్ల చాలా పొడవైన ఈ తీరం సముద్ర జలాల వల్ల ప్రభావితం కాలేదు.ఆది, సోమ, శుక్రవారాల్లో ధార్మికులు ఇక్కడికి చర్చికి వచ్చే జనాన్ని చూసి ఆనందించవచ్చు.