Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోవలం » వాతావరణం

కోవలం వాతావరణం

ఉత్తమ సమయం అక్టోబర్, ఫిబ్రవరి మధ్య కోవలం సందర్శించడం ఉత్తమం. నిజానికి, సెలవులు గడపడానికి ఈ తీర ప్రాంతానికి రావడానికి ఇదే సరైన సమయం. వేసవి కాలంలో మధ్యాహ్నాలు చాలా వేడిగా ఉంటాయి కాబట్టి స్థల సందర్శనకు అనువుగా ఉండదు, వర్షాకాలంలో వర్షాలు మీ ప్రణాళికలను పాడు చేస్తాయి.  

వేసవి

వేసవి కోవలం భౌగోళిక ప్రదేశం కారణంగా ఉష్ణమండల వాతావరణ౦ కలిగి వుంటుంది. అందువలన, ఈ తీర ప్రాంతంలో ఋతువులు ఇతమిద్ధంగా వుండవు. వేసవిలో ఇక్కడి సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీలు,37 డిగ్రీల మధ్య ఉంటుంది. అయితే, ఇంకా వేడిగా కూడా ఉండవచ్చు. మే-సెప్టెంబర్ మధ్య తేమ ఎక్కువగా ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం కోవలం లో వర్షాకాలం జూన్ నెల మధ్యలో మొదలై సెప్టెంబర్ మధ్య వరకు ఉంటుంది. ఈ పట్టణం నైరుతీ రుతుపవనాలు దగ్గరలో ఉండడం వల్ల కుండపోతగా వర్షాలు కురుస్తాయి. కొన్నిసార్లు, ఈ పట్టణంలో ఏప్రిల్ తరువాత, మే కి ముందు, ముందుగా రుతుపవనాలు వస్తాయి కూడా.  

చలికాలం

శీతాకాలం కోవలంలో చలికాలం దేశంలోని ఇతర ప్రాంతాలలాగా అంత ఎక్కువగా ఉండదు. పగటి సమయంలో ప్రత్యేకించి ఎండలో బైటికి వెళ్ళేటపుడు భారీ దుస్తులు ధరించక౦డి. అయితే, రాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు తగ్గి ఉంటుంది కాబట్టి తేలికపాటి జాకెట్ ధరించడం ఉత్తమం.