తాళి వాలీ ఒక ప్రశాంతమైన ఒక గ్రామం. దీనిని 'లిటిల్ ఇంగ్లాండ్' అనికూడా అంటారు. లెక్కలేనన్ని సరస్సులు , కొండలు, మరియు లోయలు , అన్నీకలిపి ఈప్రదేశాన్ని ఒక సుందరమైన ప్రదేశంగా మార్చాయి.
హోసూర్ కు 25 కి.మీ.ల దూరంలో కల ఈప్రదేశం కర్ణాటక మరియు తమిళ్ నాడుల నుండి చేరవచ్చు. తాళి లో ట్రెక్కింగ్ హైకింగ్ చేయవచ్చు. హైకింగ్ కు నిట్టనిలువుగా వుండే ప్రదేశాలు ఎన్నో కలవు. తాళి సంవత్సరంపొడవునా చల్లగా వుంటుంది. స్థానికులకు ఇది ఒక వేసవి విడిది గా వుంటుంది. తమిళ్ నాడు వేసవిలో వేడిగా ఉన్నప్పటికీ, తాళి, కృష్ణ గిరి, బెంగుళూరు మరియు హోసూర్ లకు సమీపంగా వుండటం తో పర్యాటకులు ఈప్రాంతంలో తప్పక బస చేసి ఆనందిస్తారు. చరిత్ర పట్ల ఆసక్తి కలవారికి ఇక్కడి దేన్కానికోట్టాయి కోట ప్రసిద్ధి. దీనిని 1530 లో నిర్మించారు.
ఈకోట కొంత శిధిలం అయినప్పటికీ , నేటికి చరిత్రను తెలుపుతుంది. మత పర యాత్రికులకు ఇక్కడకల వేణుగోపాల స్వామీ టెంపుల్ తప్పక చూడాలి. తాళి ప్రతి ఒక్కరికి వారి అవసరాలను అందిస్తుంది.