మిలాం హిమానీనదం హిమాలయ శ్రేణిలో దక్షిణం వాలు వైపు ఉంది. ఈ హిమానీనదం యొక్క ఎత్తు 5,500 మీటర్లు నుండి 3,870 మీటర్లు వరకు ఉంటుంది. కుమావున్ ప్రాంతంలో ఉన్న అన్ని హిమానీనదాలలో అతి పెద్దదైన ఈ హిమానీనదం 37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలది. అంతేకాకుండా, మిలాం హిమానీనదం కాళి నది ఉపనది అయిన గోరిగంగకు మూలం. హిమానీనదం ట్రెక్ జలపాతాలు, గ్రామాలు, అడవులు మరియు చెక్క వంతెనల మీదుగా వెళుతుంది. యాత్రికులు పితోరగర్ జిల్లా తాలూకా అయిన మున్సియారి ని వారి స్థావరంగా చేసుకుని, ఆహార ఏర్పాట్లు చేసుకోచ్చు.