కుంటా నుండి 5 కి.మీ. ల దూరంలో ఉన్న అందమైన ధారేశ్వర్ బీచ్ కూడా పర్యాటకులు చూడవలసిందే. కుంటా నుండి 4 కి.మీ. దూరంలో అరేబియన్ సముద్రం ఒడ్డునే ఉంటుంది. ఇక్కడ సమీపంలోనిగల బీచ్ లన్నింటికంటే ఇది ఎంతో వెడల్పుగా ఉంటుంది. పర్యాటకులు బీచ్ నుండి నడుస్తూ ఎత్తైన రాతి ప్రదేశాలకు కూడా చేరుకోవచ్చు. లైట్ హౌస్, వరి పొలాలు, కొబ్బరి చెట్లు వంటివి అక్కడినుండి చూడవచ్చు. పర్యాటకులు అందమైన అరేబియా సముద్రాన్ని కూడా బీచ్ నుండి చూడవచ్చు. బీచ్ లో ఉన్న అందమైన చర్చి వారికి కన్నులకు విందు చేస్తుంది.