కురుక్షేత్రలో అనేక పార్కులు ఉన్నాయి, మీరు ఇక్కడ రద్దీగా ఉండే నగర జీవితం నుండి ప్రశాంత క్షణాలను ఆనందించవచ్చు. ఓ.పి.పార్క్ అత్యంత ప్రసిద్ధ పార్కులలో ఒకటి, మ్యూజికల్ ఫౌంటైన్, ఇది హర్యానా పవర్ మినిస్టర్ ఓ.పి. జిందాల్ జ్ఞాపకార్ధం గౌరవంతో ఏర్పాటుచేసింది.
ఈ పార్కులో పిల్లలకు చెందిన దానితో కలిపి అనేక ప్రాంతాలు ఉన్నాయి. చిన్నపిల్లల ఏరియాలో రంగురంగుల ఉయ్యాలలు, జంతువుల జోన్, ఆటల ప్రదేశం తోపాటు వినోద ప్రదేశం కూడా ఉంది. ఇందులో గులాబీ తోట, జాగింగ్ ప్రదేశం కూడా ఉంది. రాత్రిపూట మ్యూజికల్ ఫౌంటైన్ దేదీప్యమానంగా ఉంటుంది. ఈ పార్కు 14 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. దానిపక్కనే ఉన్న స్థలాన్ని ధ్యానానికి ఉపయోగిస్తారు.