గుజరాత్ లోని లిటిల్ రణ్ ఆఫ్ కచ్ లో లిటిల్ రణ్ వైల్డ్ యాస్ సాంక్చూరీ ఉంది. ఇది భారతదేశంలోని అతి పెద్ద సాంక్చూరీ. ఇది 4954 కిలో మీటర్లలో విస్తరించి అనేక రకాల పక్షులు మరియు జంతువులతో నిండి ఉంటుంది. ఈ సాంక్చూరీలో అంతరించే జంతువుల జాబితాలో ఉన్న "చింకార","ఆఫ్రికన్ శివంగి" మరియు"నిల్గాయిస్" అనబడే ఆఫ్రికా జింక ఉన్నాయి. ఇవన్నీ దాదాపు 3000 వరకూ ఉండటం వల్ల వీటిని గుంపులు గుంపులు గా చూడవచ్చు. ముఖ్యం గా సంతానోత్పత్తి కాలం లో ఇలా గుంపులుగా కనపడటం మరీ ఎక్కువ.