పంగోంగ్ సరస్సు నుండి 7 కి.మీ. ల దూరంలో ఉన్న స్పంగ్మిక్, పంగోంగ్ ప్రాంతంలోని సుదూర ఏకాంత ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పర్యాటకులు స్పంగ్మిక్ గ్రామం నుంచి మంచుతో నిండిన చాంగ్-చెన్మోశ్రేణి మరియు పంగోంగ్ శ్రేణి యొక్క విస్తృత దృశ్యాలు చూడగలుగుతారు. అదనంగా, సందర్శకులు గ్రామానికి సమీపంలో, పంగోంగ్ సరస్సుకి వాయువ్య భాగంలో ఉన్న అనేక హిమానీనదాలు కూడా చూడగలరు.