ఛాపర్ శాంక్చురీ లడ్నన్ నుండి 25 కి.మీ.ల దూరంలో కలదు. ఈ శాంక్చురీ అందమైన లేళ్ళకు ప్రసిద్ధి. ఈ శాంక్చురీలోని అకాషియా మరియు ప్రొతోపిస్ చెట్లు ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడే కొన్ని వర్షాధారిత చెరువులు కూడా కలవు. ఇవి జంతువులకు నీరు అందిస్తాయి.
ఈ శాంక్చురీలో ప్రత్యకమైన మోతియా అనే గడ్డి కలదు. మోతియా అనే పదాన్ని మోతి లేదా ముత్యం నుండి పొందారు. ఈ గడ్డి విత్తనాలు ముత్యాల వలే ఉంటాయి. తియ్యగా కూడా ఉంటాయి. పర్యాటకులు ఈ విత్తనాలు తిని ఆనందిస్తారు. ఇక్కడి పక్షులకు కూడా ఈ విత్తనాలు ఆహారం. హేరియర్స్ అనే వలస పక్షులు ఇక్కడకు వస్తూంటాయి. సెప్టెంబర్ నెలలో వీటి వలసలు అధికం. ఇవి చిన్న పురుగులను తింటాయి.
పక్షుల పట్ల ఆసక్తి కలవారు యురేషియా నుండి ఇక్కడకు వలస వచ్చే డెమోసిలి కొంగలను చూచేందుకు మార్చి నెలలో వస్తారు. ఇక్కడి బ్లాక్ బక్స్ మాత్రమే కాక పర్యాటకులు ఎడారి నక్కలను, ఎడారి పిల్లులను మొదలైన ఇతర జంతువులను కూడా సంవత్సరం అంతా చూడవచ్చు.