సల్సార్ బాలాజీ లేదా సల్సార్ ధామ్ అనేది ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ఇది లడ్నన్ కు సుమారు 37 కి.మీ.ల దూరంలో కలదు. ఈ దేవాలయం హిందువుల భగవానుడు అయిన హనుమాన్ విగ్రహం కలది. ఈయననే ఇక్కడ బాలాజీ అని అంటారు. చైత్ర మరియు ఆశ్వీయజ పూర్ణిమలనాడు ఇక్కడ ఒక పెద్ద జాతర జరుగుతుంది. అనేక మంది భక్తులు ఈ సమయంలో తరలి వచ్చి పూజలు చేస్తారు.
పర్యాటకులు ఇక్కడే రాణి సతి దేవాలయాన్ని మరియు ఖటుశ్యామ్ జీ లను సల్సార్ బాలాజీ కి సమీపంలో చూడవచ్చు. ఈ ఆధ్యాత్మిక ప్రదేశాన్ని శక్తి స్ధల్ అని కూడా అంటారు.